TPUS | ధర్మారం, ఫిబ్రవరి 5 : ధర్మారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం( టీపీయూఎస్) సర్వసభ్య సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుండవేని జగన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పైడిచింతలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుర్రాల గంగారెడ్డి ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పత్తిపాక లంబాడితండా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడ్డం దశరథ రెడ్డిని ఎన్నుకున్నారు.
కోశాధికారిగా బండారు జలపతి, ఉపాధ్యక్షులుగా అడిశర్ల సతీష్ కుమార్, సీహెచ్ ప్రసాద్, జీ కృష్ణ హరి, మహిళా ఉపాధ్యక్షులుగా చిదురాల భాగ్యలక్ష్మి, టీ స్వప్న, ఎన్ రాజేశ్వరి, కార్యదర్శులుగా ఆర్ సుధాకర్, ఎల్ సిద్దిరాములు, వెంకటేశ్వర్లు, మహిళా కార్యదర్శులుగా మూల రమాదేవి, ఆర్ జానకి, జీ ప్రసన్న కుమారి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా గండ్రాతి శ్రీలత, గుండా ప్రభాకర్, బద్దం ప్రకాష్ రెడ్డి, అర్పిత, ఈ స్వరూప, స్వాతి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర బాధ్యులు వనపర్తి అంజయ్య, జిల్లా బాధ్యులు నూతి మల్లన్న, వ్యాల్ల రాజేందర్ రెడ్డి, జక్కుల శ్రీదేవి, వెంకటేశ్వర్లు, ముద్దసాని సతీష్, కోట శశి, గుండ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.