ఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఢిల్లీలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన సెమీఫైనల్స్‌లో భార త్.. ఇంగ్లండ్‌ను చిత్తుచేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మహిళల జట్టు.. 3-1తో, పురుషుల జట్టు 3-0తో ఇంగ్లండ్‌ను ఇంటికి పంపించింది. మహిళల విభాగంలో హైదరాబాదీ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ గెలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఫైనల్స్‌లో భారత జట్లు.. మలేషియాతో అమీతుమీ తేల్చుకోనున్నాయి.