జమ్మికుంట, జనవరి 10: కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జమ్మికుంట పట్టణంలోని షత్రంజి చేనేత సంఘం అధ్యక్షుడు రమేశ్ ఆధ్వర్యంలో జీఎస్టీకి వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని సోమవారం జడ్పీ చైర్పర్సన్ విజయ, టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్, తదితరులతో కలిసి సందర్శించారు. దీక్షకు మద్దతు పలికారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత చైర్మన్ మాట్లాడారు. చేనేత పరిశ్రమలపై పన్నుల భారం వేయకూడదని, గతంలో ఉన్న పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్లు ప్రణీత, రమేశ్, భాస్కర్, నాయకులు దిలీప్, శివశంకర్, చేనేత సహకారం సంఘాల అధ్యక్షులు, సభ్యులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
క్రీడల్లో రాణించాలి
ప్రతి యువకుడు క్రీడల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి రాణించాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆకాంక్షించారు. సీనియర్ పాత్రికేయుడు మాతృమూర్తి నిమ్మటూరి రాజేశ్వరి స్మారకార్థం పట్టణంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను సోమవారం వారు ప్రారంభించి మాట్లాడారు. రాజేశ్వరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క్రికెట్ టోర్నమెంట్‌కు 30 జట్లు హాజరైనట్లు ఇన్చార్జి నిమ్మటూరి సాయికృష్ణ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు బీఎస్ ఇమ్రాన్, క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు దామెర రాము, నిర్వాహకులు సాయికృష్ణ, లవన్, ప్రశాంత్, నవీన్, సల్మాన్, వినయ్, అభిలాష్ పాల్గొన్నారు.