BRSV demand | కమానౌచౌరస్తా, సెప్టెంబర్ 11 : గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్, సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని శాతవాహన యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి, నిరుద్యోగ విద్యార్థులతో కలిసి ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడిగే వారిని అరెస్టులు చేయకుండా, గ్రూప్- 1పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జీవో నెం. 29 రద్దు చేయాలని, జీవో 55 ఇంప్లిమెంటేషన్ చేయాలన్నారు. గ్రూప్-1పరీక్షను రద్దు చేసి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని, హైకోర్టు చెప్పినట్టుగా అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ చేయాలన్నారు. గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్, కమిషన్ అధికారులు వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేకుంటే ప్రభుత్వంపై యుద్ధం చేయక తప్పదని, గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్వీ పోరాటం చేస్తూనే ఉంటుదన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్, బీఆర్ఎస్వీ నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, బీఆర్ఎస్ యూత్ కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షుడు గంగాధర చందు, నాయకులు బందారపు అజయ్ కుమార్ గౌడ్, ఆరే రవి గౌడ్, నారదాసు వసంత రావు, పటేల్ శ్రవణ్ రెడ్డి, సోమిరెడ్డి నరేష్ రెడ్డి, ఒడ్నాల రాజు, ఆఫ్రోజ్, అవినాష్, సోహెల్, సైఫ్, ప్రశాంత్, పదం సిద్ధు, లింగాల సాయి కిరణ్, ఉప్పు మనోజ్, శ్యామ్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.