Ramayyapalli | ధర్మారం, జులై 13 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచి మూల మంగ ఆదివారం భూమి పూజ చేశారు. సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 లక్షల నిధులు మంజూరు చేసింది. దీంతో సర్పంచి స్థానిక వార్డు సభ్యులతో కలిసి మంగ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భూతగడ్డ గట్టమ్మ , పంచాయతీ కార్యదర్శి శైలజ రాణి, వార్డు సభ్యులు మూల బాలయ్య, గుడికందుల సుజాత రవి, ఏగుర్ల శ్రీకాంత్, మార్క గాయత్రి, అమరగాని లక్ష్మీ, కొమ్మ మధుకర్, ఉయ్యాల శ్రీనివాస్, స్థానిక నాయకులు గాగిరెడ్డి డిల్లేశ్వర్ రెడ్డి, మార్క తిరుపతి, భూతగడ్డ సంతోష్, సముద్రాల మల్లయ్య, కోట సత్తయ్య, కోట తిరుపతి, పల్లె బాపు, సముద్రాల వెంకటేశం, మార్క సంపత్ తదితరులు పాల్గొన్నారు.