వేములవాడ, ఆగస్టు 7: వేములవాడను గుడిసెలులేని పట్ణణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ప్రకటించారు. బల్దియా పరిధిలో 1200 మంది నిరుపేదలకు రూ. 55 కోట్లతో ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. ఇందులో 800 డబుల్బెడ్రూం ఇండ్లు, గృహాలక్ష్మి కింద 400 ఇండ్లు కట్టుకునేవారికి రూ. 3 లక్షల చొప్పున అందజేస్తామన్నారు. సోమవారం బల్దియా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి 300 ఇండ్లను మంజూరు చేశారని చెప్పా రు. గతంలో 1800తో కలిపి 48 వందల ఇండ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి పేదింటి కుటుంబానికి సొంత ఇంటి కలను సీఎం కేసీఆర్ గృహాలక్ష్మి స్కీం ద్వారా నిజం చేయబోతున్నారని చెప్పారు. 500 మంది కుటుంబాలకు 75 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. ఇందుకు 13 ఎకరాల స్థలం సేకరించి లేఅవుట్ పూర్తిచేశామని వెల్లడించారు.
ఇందులో రోడ్లు, ఇతరత్రా పనులకు రూ. 25 లక్షలు కలెక్టర్ నిధులు కేటాయిస్తామని చెప్పారన్నారు. అన్ని వర్గాలకు రిజర్వేషన్ల ప్రకారం స్కీంను వర్తింపజేస్తామని చెప్పారు. అలాగే హాట్ స్పాట్ కింద కొన్నింటిని గుర్తించి వారికి ప్రత్యేకంగా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తిప్పాపూర్‌లో ఇల్లు ఉండి పట్టాలని 160 కుటుంబాలకు పట్టాలు, స్థలం ఉం డి ఇండ్లు లేని 60 కుటుంబాలకు కూడా తక్షణమే అమలు చేసే విధంగా చూస్తున్నామని హామీ ఇచ్చారు. నాంపల్లి పరిధిలో ప్రధాన రహదారిలో నిర్మాణంలో ఉన్న 144 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి నిధులను మంత్రి కేటీఆర్ సహకారంతో సమకూరుస్తున్నామన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రతి ఒకరూ దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అర్హత ఉన్నవారికి, అర్హత పత్రాన్ని కూడా అందజేస్తామని చెప్పారు. మహిళలు మాత్ర మే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత ఉన్నవారికి దశలవారీగా మంజూరు చేసేందుకు అధికారులు సిద్ధమవుతారని చెప్పారు. అనంతరం ఆయన కార్యాలయ ఆవరణలో మహిళల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
రూ.100 కోట్ల పనులకు మంత్రి శంకుస్థాపన..
వేములవాడ పట్టణంలో 100 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు మంత్రి కేటీఆర్ మంగళవారం చేస్తారని ఎమ్మెల్యే రమేశ్ బాబు తెలిపారు. అభివృద్ధి పనులు అన్నింటిని ప్రారంభిస్తునుండగా ప్రజలు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బల్దియా చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, కమిషనర్ అన్వేశ్,సెస్ డైరెక్టర్ నామాల ఉమ, కౌన్సిలర్లు నిమ్మశేట్టి విజయ్, మారం కుమార్, జడల లక్ష్మి, నీలం కల్యాణి, జోగనీ శంకర్, కందుల శ్రీలత, సిరిగిరి రామచందర్, యాచమనేని శ్రీనివాసరావు, గడ్డమీది లావణ్య, చింతపండు దివ్య కుమ్మరి శిరీష, నరాల శేఖర్, ఇప్పప్పుల అజయ్, అన్నారం ఉమారాణి, గూడూరి లక్ష్మీ, ముప్పిడి సునంద, గోలి మహేశ్, కో ఆప్షన్ సభ్యులు కటూరి శ్రీనివాస్, బాబున్, పార్టీ అధ్యక్షులు పులం రాజు, నాయకులు రామతీర్థపు రాజు, పొలాస నరేందర్, అంజద్ పాషా, పీర్ మహ్మద్, గూడూరు మధు, కుమ్మరి శ్రీనివాస్, కొండ కనుకయ్య, సలీం, నరాల దేవేందర్ ,నీలం శేఖర్ ఉన్నారు.