ఇల్లు కట్టాలనుకుంటున్నారా..
అపార్ట్మెంట్, విల్లా కొనాలనుకుంటున్నారా..?
ల్యాండ్‌పై ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా..?
హౌసింగ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా..?
వీటికోసం వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారా?
అయినా మీకు ఎక్కడా పూర్తి సమాచారం అందడం లేదా? అయితే మీ కోసమే ‘నమస్తే తెలంగాణ’ ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నది. ఈ నెల 8, 9 తేదీల్లో కరీంనగర్లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నది. రండి.. మరెందుకాలస్యం!
కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 6 : కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో ‘నమస్తే తెలంగాణ’ రెండు రోజుల పాటు ప్రాపర్టీ షో నిర్వహించనున్నది. ఈ నెల 8న ఉదయం 10 గంటలకు ప్రారంభమై.. 9న సాయంత్రం ఏడు గంటలతో ముగియనున్నది. ఔత్సాహిక కొనుగోలుదారులకు ఎంట్రీ ఉచితం. ఈ ప్రాపర్టీ షోకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఫోన్ నెంబర్ల (9182777571, 9182777572)ను సంప్రదించవచ్చు. ప్రముఖ నిర్మాణ సంస్థలు, ప్రధాన బ్యాంకులకు చెందిన సంస్థలు ఈ ప్రాపర్టీ షోలో పాల్గొంటాయి. వినియోగదారులకు పూర్తి సమాచారం అందిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లు, ఆస్తులు కొనాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఒక చక్కని వేదికగా పనిచేస్తుంది.