Karimnagar | కమాన్ చౌరస్తా, మార్చ్ 8 : కరీంనగర్లోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో నూతన ధ్వజస్తంభ శిఖర సహిత ఆంజనేయస్వామి ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిత్యారాధన, నిత్యహవనం, మూర్తి మంత్ర హవనం, పారాయణాలు, సామూహిక శ్రీవిష్టు సహస్రనామ పారాయణ చేశారు.
ధాన్యాధివాసములు నిర్వహించారు. అనంతన భక్తులకు తీర్థప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గౌతమ్ రావు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.