Dharmaram | ధర్మారం,ఏప్రిల్ 27: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని రజతోత్స వేడుకలను ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జెండా గద్దెపై గులాబీ జెండాను పట్టణ శాఖ అధ్యక్షుడు రాంబాబు ఎగురవేశారు.
అనంతరం పార్టీ నాయకులకు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు గుర్రం మోహన్ రెడ్డి, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, రైతుబంధు సమితి మాజీ జిల్లా సభ్యుడు పూస్కురు రామారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నాడెం శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు మిట్ట తిరుపతి, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లయ్య, సోషల్ మీడియా కన్వీనర్ దేవి నళిని కాంత్, పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి మల్లారెడ్డి, ఆవుల శ్రీనివాస్, కోమటిరెడ్డి తిరుపతిరెడ్డి, అజ్మీర శ్రీనివాస్ నాయక్, బోయిని మల్లేశం, రాగుల మల్లేశం, నార ప్రేమ్ సాగర్, అర్థవెల్లి రాము, మిట్ట భరత్ కుమార్ ,పులి నవీన్, బాణాల నాగరాజు, ఆవుల వేణు, దేవి రాజేందర్, దేవి అజయ్ కుమార్, మహిళ నాయకురాళ్లు ఆవుల లత, కాంపల్లి అపర్ణ, మార్క సంధ్యారాణి, ఈర్ల వనిత, రేగుల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.