Chigurumamidi | చిగురుమామిడి మండలంలో అభివృద్ధి పనులపై గ్రామ సభలు
చిగురుమామిడి మండలంలోని రేకొండ, సుందరగిరి, గునుకుల పల్లె, సీతారాంపూర్ గ్రామాల్లో గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శనివారం గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.
Chigurumamidi | చిగురుమామిడి, ఆగస్టు 1 : చిగురుమామిడి మండలంలోని రేకొండ, సుందరగిరి, గునుకుల పల్లె, సీతారాంపూర్ గ్రామాల్లో గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శనివారం గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గ్రామ సభలో నిర్ణయించారు. 16వ ఆర్థిక సంఘం నిధులు, స్టేట్ ఫైనాన్స్, ఎస్ఎఫ్టీ, జనరల్ ఫండ్ మొదటి నిధుల నుండి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గ్రామసభలో తీర్మానించారు.
గ్రామాల్లో అంటూ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు, ఇంటింటా ఇంకుడు గుంతలు, పొలానికి పంటకుంట, ఊరికి ఊరకుంట, తాగునీరు, విద్యుత్, రోడ్లు, మురికి కాలువలు మొదలగు అభివృద్ధి పనులను తీర్మానించారు. ఈ గ్రామ సభలో గ్రామ సర్పంచులు అల్లెపు సంపత్, జంగ శిరీష, గునుకుల మధుసూదన్ రెడ్డి, గోగూరి లక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు గోదారి అజయ్, సంపత్, అరుణ్, కాల్వ రమేష్ ఏఈవోలు అఖిల, రాకేష్, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

