CITU | ధర్మారం, సెప్టెంబర్ 24: గ్రామ పంచాయతీలలో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు పరిచి పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బంది అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎరవెల్లి ముత్యంరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బుధవారం తెలంగాణా గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ ,వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా 4వ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీపెల్లి రవీందర్ అధ్యక్షతన జరిగింది.
ఈమహాసభ హాజరైన యూనియన్ జిల్లా అధ్యక్షుడు ముత్యంరావు ముఖ్యఅతిథిగా హాజరైనారు . అంతకు ముందు వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న కమాన్ వద్ద సీఐటీయూ జండా ఆవిష్కరించిన అనంతరం మార్కెట్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు పంచాయతీ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు .అనంతరం జరిగిన సభలో ముత్యంరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని,మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని,గ్రామపంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలని జీవో నెంబర్ 51 సమరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని బకాయి వేతనాలు చెల్లించాలని గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు . అధికారంలోకి రాకముందు పంచాయతీ సిబ్బందికి నెలకు రూ.18 వేలు వేతనం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి దానిని అమలు చేయడంలో విఫలమైనట్లు ఆయన విమర్శించారు.
ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వేతనాన్ని పెంచి సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బందికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వ స్థలాలు ఇవ్వాలని,ప్రమాదాలకు ఒరేయ్ మరణించిన కార్మికులకు రూ. 20 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, అదనపు పనికి అదనపు వేతనం చెల్లించాలని ముత్యంరావు డిమాండ్ చేశారు. సిబ్బందికి ఉద్యోగ భద్రత, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఖాజా,జిల్లా ఉపాధ్యక్షులు ఇరుగురాల లచ్చయ్య, కే అశోక్, కమిటీ సభ్యులు గంగాధర్,రవి కుమార్,వేల్పుల భాస్కర్,రెడ్డిమల్ల నాగేశ్వర్,దేవేందర్,పైడిపల్లి నాగయ్య,రామచందర్,శంకర్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.