Increase in pension | హుజురాబాద్, సెప్టెంబర్ 20 : హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డి పేటలో వికలాంగుల పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ముట్టడించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవు నూరి రవీందర్, తెలంగాణ బీసీ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ వికలాంగులు వితంతువులు వృద్ధులు కోసం ఎమ్మార్పీఎస్ రాష్ట్రవ్యాప్తంగా ముట్టడి కార్యక్రమాన్ని తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎవరికి కూడా పింఛన్ పెంచకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయా పింఛన్దారులకు వెంటనే పింఛన్ పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామ కార్యదర్శి గిన్నారపు లావణ్య కు మెమోరాండాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు వెన్కేపల్లి మధుసూదన్ గాజే లక్ష్మి, ప్రియా చందుపట్ల, విట్టల్ మంతెన, భాస్కర్, సంధి మల్లారెడ్డి, ఏఎంసీ మెంబర్ లోకిని రాజకుమార్, బొంగోని శ్రావణ్, ప్రజా నాయకులు గాజుల హరీష్, చింత శ్రీనివాస్, కంకణాల కుమార్ ఓ ల్లాల నరేష్, కంకణాల కొమురయ్య, చింత శ్యామ్, బొల్లె వేని కనకమ్మ, బో ల్లెవెని మీనమ్మ గాజ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.