without cutting | పెద్దపల్లి మే 3: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద ఎక్కడా కూడా కోత విధించటానికి వీల్లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు, తరలింపుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శనివారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ రోజు 15 వేల క్వింటాళ్ల ధాన్యం కూడా లిఫ్ట్ చేయడం లేదని, అకాల వర్షాలు కురిస్తే అనవసరంగా నష్టం వస్తుందని, ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు, రైలు మిల్లులలో హమాలీ కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీసీవో శ్రీ మాల, డీఏవో దోమ ఆదిరెడ్డి, డీఆర్డీవో ఎం కాళిందిని, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.