Kalvasrirampur | కాల్వ శ్రీరాంపూర్ , ఏప్రిల్ 25 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి, మడిపల్లి, ఆశన్నపల్లి, పెద్దంపేట మాల్యాల, కిష్టంపేట, మోట్లపల్లి, చిన్నరాత్ పల్లి, పెద్ద రాత్ పల్లి, ఇదులాపూర్ గ్రామాల్లో సెర్ఫ్, సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
దళారుల నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం అంకంపల్లి, ఇదులాపూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఏఎంసీ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, సహకార సంఘం సీఈవోలు కోలేటి శ్రీనివాస్, విజేందర్, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.