Mulkanoor | చిగురుమామిడి, ఏప్రిల్ 24 : చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో హకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సర్పంచ్ సాంబారి భారతమ్మకొమురయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మధ్య దళారులకు ధాన్యం అమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పూర్ణచందర్, ఉప సర్పంచ్ పైడిపల్లి వెంకటేష్, మాజీ ఎంపీటీసీ సాంబారి కొమురయ్య, బీఆర్ఎస్ మండల నాయకుడు పెసరి రాజేశం, బరిగెల సదానందం, గుండ సాయి, కయ్యం రవి, వార్డు సభ్యులు తిరుపతి, రజాక్, విజయలక్ష్మి, రైతులు, నిర్వాహకులు పాల్గొన్నారు.