తిమ్మాపూర్,మార్చి30 : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే సేయింట్ ఆంథోనీ పాఠశాలల ముఖ్య ఉద్దేశమని కరస్పాండెంట్ రంజిత్ రెడ్డి, దాచారం కరస్పాండెంట్ యెరువ అజిత్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని సేయింట్ ఆంథోనీ హైస్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులకు మెరిట్ సర్టిఫికేట్ లను అందజేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తమ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు మంచి ఫ్యాకల్టీ ని అందుబాటులో ఉంచామని చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.