– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్
దమ్మపేట, జూలై 30 : కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్‌కు చాలా తక్కువ నిధులు కేటాయించడం వల్ల అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడడం లేదని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. గురువారం అంగన్వాడీ టీచర్స్ సమావేశాలు దురదపాడు చలమప్పగూడెంలో జరిగాయి. పిట్టల అర్జున్ హజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సరైన పోషకాహారం అందించడం, మాతా శిశు మరణాలు తగ్గించే లక్ష్యంతో ఐసిడిఎస్ ఏర్పాటు అయిందని, కానీ పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఏర్పాటు చేసిన ఉద్దేశం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచడం గాని, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26,000 వేతనం ఇవ్వాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రైతులు వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కారానికి ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో చేపట్టే జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు దమ్మపేట మండల కన్వీనర్ మురహరి రఘు, సూరమ్మ, జ్వోతి, వెంకటేశ్వరమ్మ, శ్రీదేవి, వజ్రమ్మ, వెంకటలక్ష్మి, రామలక్ష్మి పాల్గొన్నారు.