GP worker | ధర్మారం, జూలై 9 : పెద్దపల్లి జిల్లా మండలం దొంగతుర్థి గ్రామానికి చెందిన జిపి కార్మికుడు ఆకుల రాజయ్య (60) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. ఈరోజు కార్మికుల దేశవ్యాప్త సమ్మె లో భాగంగా ధర్మారం మండల కేంద్రానికి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న క్రమంలో రాజయ్య తీవ్ర అస్వస్థకు గురై పడిపోగా తోటి జీపీ కార్మికులు అతడిని ధర్మారంలోని ఒక ప్రైవేటు దవఖానకు తరలించారు. అప్పటికి ఆయన పరిస్థితి విషమించడంతో కరీంనగర్ కు తరలించగా రాజయ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.