విద్యానగర్, జనవరి 5: రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను 2023 వైద్య సంవత్సరానికి గాను అనుమతినిచ్చింది. ఇందుకు వైద్యాధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. గురువారం ప్రభుత్వ దవాఖానలోని మెయిన్ గేట్‌కు ప్రభుత్వ వైద్య కళాశాల, కరీంనగర్ బోర్డును ఏర్పాటు చేశారు. తరగతి గదులతోపాటు పలు బ్లాకులను ఏర్పా టు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
పూర్తిస్థాయిలో వైద్య విద్యకు అవసరమైన వసతులను ఏర్పాట్లు చేస్తున్నామని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల తెలిపా రు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్ఎంవో డాక్టర్ నవీనా, డాక్టర్ పద్మ, ఫార్మసిస్టు గ్రేడ్-1 ఆకుల ప్రభాకర్, ల్యాబ్ ఇన్చార్జి రవీందర్, కాంట్రాక్టర్ మధుసూదన్ రాజు పాల్గొన్నారు.