Governor Jishnu Dev Verma | కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 7 : శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మొదటగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, డిపార్ట్మెంట్ వారీగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం వందేమాతర గేయంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలభవన్ విద్యార్థుల శాస్త్రీయ నృత్యం, అంధ విద్యార్థుల పాటలను ఆలపించారు.
జిల్లా సమగ్ర స్వరూపంతో పాటు జిల్లా విశేషాలను కలెక్టర్ పమేలా సత్పతి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరి దానకిషోర్, సీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకాడే, లక్ష్మి కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.