Compost fertilizer | కోరుట్ల జూన్ 19: పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు పట్టణ శివారులోని కంపోస్ట్ ఎరువు తయారీ కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఒక మార్పు అభివృద్ధికి మలుపు వందరోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు తడి, పొడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారీ విధానాన్ని విద్యార్థులకు వివరించారు.
తడి, పొడి చెత్తతో ఇంటి వద్దనే ఎరువు తయారు చేసుకొని మొక్కలకు అందించాలని విద్యార్థులకు సూచించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, ఏన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ మోహన్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.