పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా అత్యధిక మార్కులు సాధించి సత్తాచాటారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లోనూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు.
చొప్పదండి, ఏప్రిల్ 29 : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల విద్యార్థినులు ఎం అశ్విత 581, ఉరా ది వర్షిత 568, గుంటి అఖిల 567 మారులు సాధించి జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచారు. చొప్పదండి బాలికల పాఠశాల చెట్టిపల్లి సింధు 567 ,బాలుర పాఠశాలలో ఏ సౌమ్య 555, వెదురుగట్ట జడ్పీహెచ్ఎస్లో కే రిషిక 548, గుమ్లాపూర్ జడ్పీహెచ్ఎస్లో రిషి 546, ఆర్నకొండ జడ్పీహెచ్ఎస్లో బీ మేఘన శ్రీ 545 మార్కులు సాధించారు. రుక్మాపూర్ ఆదర్శ పాఠశాలలో ఏ వైష్ణవి 566, ఏ సాయి స్నేహిత 562, ఎన్ సింగిదీత 562, ఎం సాయి కీర్తన 560, వై కీర్తిక 549మార్కులతోపాటు పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ నిమ్మల సుధాకర్ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సోషల్ వెల్ఫేర్ సూల్ ప్రిన్సిపాల్ స్వాతి, రుక్మాపూర్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ నిమ్మల సుధాకర్ అభినందించారు.
సైదాపూర్, ఏప్రిల్ 29: మండలంలోని తొమ్మిది జడ్పీహెచ్ఎస్, సోమారం మోడల్‌స్కూల్, ఆకునూర్ కేజీవీబీ, ఎంజేపీ బా య్స్ పాఠశాలల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో రవీంద్రాచారి తెలిపారు. 339విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలకు హాజరుకాగా, 339మంది ఉత్తీర్ణత సాధించారు.
శంకరపట్నం, ఏప్రిల్ 29: మోడల్ స్కూల్ విద్యార్థి ఇజ్జిగిరి ఇందు 571 మార్కులతో మండల టాపర్‌గా, కేజీబీవీకి చెందిన బీ వర్షిత 570మార్కులతో సెకండ్ టాపర్‌గా, మోడల్ స్కూల్‌కు చెందిన వనపర్తి సిరిచందన 569 మార్కులతో థర్డ్ టాపర్‌గా నిలిచారు. మోడల్ స్కూల్‌కు చెందిన మొలంగూరి వరుణ్‌తేజ 568 మార్కులతో అదరగొట్టాడు. ఏడు ప్రభుత్వ పాఠశాలల నుంచి 109, మోడల్ స్కూల్ నుంచి 91, కేజీబీవీ నుంచి 41 విద్యార్థు లు పరీక్షలు రాయగా, అందరూ ఉత్తీర్ణులైనట్లు ఎంఈవో లక్ష్మీనారాయణ తెలిపారు.
మానకొండూర్ రూరల్, ఏప్రిల్29: మండలంలోని 560 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 558మంది విద్యార్థులు ఉత్తీర్ణతతో 99.64శాతం ఫలితాలు సాధించినట్లు మండల ఇన్చార్జి ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు. మోడల్ జూనియర్ కాలేజీ (ఎంజేపీ) నుంచి 584 మార్కులతో కేశవేని కీర్తన మండల టాపర్‌గా, 583 మార్కులతో బూర హర్షిణి, సాయిళ్ల మధుప్రియ సెకండ్ టాపర్లుగా, 578 మార్కులతో వీ శివాని థర్డ్ టాపర్‌గా నిలిచినట్లు ప్రిన్సిపాల్ లవీణ తెలిపారు. మోడల్ స్కూల్ పోచంపల్లి నుంచి కొత్తకొండ శ్రీజకు 576, పప్పు వేదశ్రీకి 569మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు.
తిమ్మాపూర్, ఏప్రిల్ 29: మండలంలో 566మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 553మంది పాస్ అయ్యారు. మం డలంలో 97.7శాతం ఉత్తీర్ణత సాధించగా, అత్యధిక మారులు సాధించి సత్తాచాటిన విద్యార్థులను టీచర్లు అభినందించారు.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 29: కరీంనగర్ మండలంలో 614 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 606మంది పాస్ కావడంతో 98.7శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో వాసవి తెలిపారు. చామనపల్లి జడ్పీహెచ్ఎస్కు చెందిన జీ లక్ష్మిభవాని 565, వీ వైష్ణవి 563మార్కులతో మండల టాపర్లుగా నిలిచారు. బొమ్మకల్ జడ్పీ హైస్కూల్లో ఎన్ ప్రసన్న 536, అభితేజ్ 517, దుర్శేడ్ జడ్పీ హైస్కూల్లో వీ అక్షిత 544, ఏ వరుణ్ 542, జూబ్లీనగర్‌లో పుల కీర్తన 546, ఎస్ శ్రీ చైతన్య 542, మొగ్దుంపూర్ జడ్పీ హైస్కూల్ వీ పూజిత 552, వెంకటేశ్ 507, నగునూర్ జడ్పీ హై స్కూల్లో షౌజియా నిషత్ 554, మాయవతి 552. మైనార్టీ గురుకుల బాలుర-1లో ఎం రాజుకుమార్ 516, డీ సిద్దాంత్ 505, గురుకుల బాలుర-2లో శ్రీకాంత్‌రెడ్డి 558, తాజ్‌బాబా 557, గురుకుల బాలుర-3లో బీ శ్రీచరన్ 564, బీ అభిరామ్ 564, ఎం తిరుమలేశ్ 541 మార్కులు సాధించారు. ఎంజేపీటీ బీసీ వెల్ఫేర్ పాఠశాలల బాలుర కొత్తపల్లిలో ఎదునూరి హర్ష 567, బాసబత్తిని స్వాతిక్ 559, ఎంజేపీటీ బీసీ వెల్ఫేర్ పాఠశాలలలో జి దివ్యజ్యోతి 553, నార స్నేహిత 551, నగునూర్ ఎస్పీఆర్లో కూర దిక్ష గంగోత్రి 575, జీ నిషనాధ్రెడ్డి 567, సిద్దార్థలో ఎస్ శ్రీ వర్షితా 576, ఎల్ శ్రీనిత 555 మార్కులు సా ధించారు. అలాగే మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ఉమ్మ డి కరీంనగర్ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 1,743 మంది విద్యార్థులు హాజరుకాగా 1,739 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. అత్యధికంగా గట్ట రితిక 585 మార్కులు సాధించింది.
రామడుగు, ఏప్రిల్ 29: మండలంలో 635మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 633మంది ఉత్తీర్ణులు కాగా, 99.68శాతం ఉత్తీర్ణత నమోదైంది. కేజీబీవీకి చెందిన దయ్యాల హర్షిణి 574, ఎన్ సిరిచందన 573, రామడుగు జడ్పీహెచ్ఎస్లో మొగుళ్ల పూజ 573, రుద్రారం జడ్పీహెచ్ఎస్లో వెలుముల శ్రీ చరణ్ 571 మార్కులు సాధించారు.