జగిత్యాల రూరల్, నవంబర్ 27: విద్యారంగం అభివృద్ధిపై కేసీఆర్ సర్కారు దృష్టిపెట్టిందని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పేరొన్నారు. ఎస్టీయూ ఆవిర్భవించి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్, మచ్చ శంకర్ అధ్వర్యంలో జగిత్యాలలో యూనియన్ వజ్రోత్సవాలను ఆదివా రం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కొ నియాడారు. ఈజీఎస్ నిధుల ద్వారా ప్రతి పాఠశాలకు సావెంజర్ను నియమించేలా కలెక్టర్‌తో చర్చించి సమస్య పరిషరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి మాట్లాడుతూ విద్యారంగ, ఉపాధ్యాయ సంక్షే మం కోసం 75 సంవత్సరాలుగా ఎస్టీయూ సేవలందించడం గొప్ప విషయమని అభినందించా రు. మన ఊరు మన బస్తి కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందం గౌడ్ మాట్లాడుతూ సీపీఎస్‌ను చేయాలని ప్రభు త్వాన్ని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కా ర్యదర్శి మేకల ప్రవీణ్, రాష్ట్ర బాధ్యులు భూ మ య్య, రాజన్న, తిరుపతిరెడ్డి, రవి ఉన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని జ్యోతి హైస్కూల్ డైరెక్టర్ హరిచరణ్ రావు స్వగృహంలో ఆదివారం అయ్యప్ప వడిపూజను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత సురేశ్ దంపతులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ పలువురు గురు స్వాములు ఉన్నారు.