కరీంనగర్ ముకరంపుర, మే 15: బీఆర్ఎస్ పాలనలో రైతులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించామని, పంటలను సకాలంలో కొనడంతోపాటు వెంట వెంటనే డబ్బులు చెల్లించామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్ గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ సర్కారు పంటల కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. రైతుల మీద ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు మకలు పండిస్తే కేవలం 25 క్వింటాళ్లే కొంటామని చెప్పి దళారులకు అమ్మే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. దీంతో ఒకో రైతు ఎకరానికి రూ.25 వేల వరకు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
కరీంనగర్ వ్యవసాయ మారెట్యార్డ్లో మార్ఫెడ్ తరఫున డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మకల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. కొనుగోళ్లలో జాప్యంతో తాము ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గంగుల స్పందించి, మార్ఫెడ్ జిల్లా మేనేజర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. కేంద్రాల వద్ద రైతుల బాధలు పట్టించుకునే దిక్కులేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను గోస పెట్టకుండా రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని, లేదంటే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
పంట మార్పిడి చేయాలని చెబితే సీఎం మాట విని రైతులు మక్కలు పండించారని, ఆ మక్కలను మార్కెట్‌కు తెస్తే సక్రమంగా కొనే దిక్కు లేదని మండిపడ్డారు. కనీసం కాంటాలు కూడా పెట్టడం లేదని, సంచుల్లో నింపి కాంటాలు పెట్టిన బస్తాలు 20 రోజులైనా కదలడం లేదన్నారు. కొనుగోళ్లలో జాప్యంపై నిలదీసే కౌలు రైతులను కొర్రీలతో ఇబ్బందులు పెట్టడం సరైన పద్ధతి కాదని సూచించారు. మార్కెట్ యార్డ్ అపరిశుభ్రంగా ఉందని, ఇది మార్కెటా..? డంప్ యార్డా…? ఇలాంటి వాతావరణంలో రైతులు ఉండాలా..? అని ప్రశ్నించారు. కొనుగోళ్లను మంత్రులు పట్టించుకోవడం లేదని, అధికారుల పర్యవేక్షణ లేదని మండిపడ్డారు. ఆయనవెంట నాయకులు రాజమల్లు, శ్యాంసుందర్‌రెడ్డి, సంపత్‌రావు, రవీందర్‌రెడ్డి, అనీల్‌కుమార్ గౌడ్, అంజయ్య, తిరుపతినాయక్, తదితరులు ఉన్నారు.