Korutla | కోరుట్ల, జూలై 3 : కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకోని గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేతులకు గోరింటాకు పెట్టుకుని విద్యార్థినిలు, ఉపాధ్యాయురాళ్లు సందడి చేశారు.
ఈ మేరకు ఆషాఢ మాసంలో గోరింటాకు విశిష్టతను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. ఆషాఢమాసంలో ప్రతీ ఏటా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థినిలు పాల్గొన్నారు.