Gourd festival | వేములవాడ రూరల్, జులై 17: వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆషాడమాసం సందర్భంగా శుక్రవారం గోరింటాకు సంబరాలు నిర్వహించారు. ఈ సంబురాలు మహిళా సాధికారత విభాగం, ఎన్ఎస్ఎస్ విభాగాల సంయుక్తంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో భాగంగా విద్యార్థినిలు కళాశాలలో గోరింటాకు చెట్ల నుండి గోరింటాకు సేకరించి, దానిని ముద్దగా చేసి ఒకరికి చేతికి మరొకరు అలంకరించుకున్నారు.
మహిళా అధ్యాపకులు, విద్యార్థినిలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీ శంకర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టీ లావణ్య, మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం శోభ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం శకుంతల, ఇతర అధ్యాపక బృందం, విద్యార్థినిలు పాల్గొన్నారు.