Good news | జ్యోతినగర్(రామగుండం), సెప్టెంబర్ 9: సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు తీపి కబురును అందించింది. గత రెండు, మూడు నెలలుగా రామగుండం రైల్వేస్టేషన్లో నిలిచిపోయిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను తిరిగి పునప్రారంభమైనట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ విషయాన్నిదక్షిన మధ్య రైల్వే డీఆర్ యూ సీసీ మెంబర్ అనుమాస శ్రీనివాస్ పేర్కొన్నారు.
రైలు నెంబర్ 12295, 12578, 12721, 22535, 22669, 12722లకు చెందిన ఎక్స్ ప్రెస్, సూపర్ పాస్ట్ రైళ్లు సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలు, దక్షిణ్ ఎక్స్ ప్రెస్, దర్బంగా ఎక్స్ ప్రెస్, తదితర రైళ్లు రామగుండం రైల్వేస్టేషన్లో ఆగనున్నట్లు వెల్లడించారు. కాగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కృషితోనే రామగుండంలో ఎక్స్ ప్రెస్ రైళ్ల నిలుపుదల జరిగిందన్నారు. అలాగే రామగుండం రైల్వేస్టేషన్‌తో పాటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో కూడా పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగుతున్నాయని చెప్పారు. ఈ రైళ్ళ హాల్ట్ కు కృషిచేసిన ఎంపీకి వంశీకృష్ణకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.