Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 28: గోదావరిఖని నగరంలోని ప్రధాన శ్రీ కోదండ రామాలయం హుండీ ఆదాయం రూ.4.81 లక్షలు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి బీ. సదయ్య తెలిపారు. ఇటీవల ఆలయంలో జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాలకు సంబంధించి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గట్ల రమేష్ హాజరై ప్రారంభించారు.
ఆలయ అర్చకులు, భక్తులు, సేవా సమితి మహిళలు కానుకలను లెక్కించగా, మొత్తం రూ.4,81,746లు వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, కానుకల లెక్కింపు ప్రక్రియను దేవాదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ పీ.సత్యనారాయణ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్ ఆసిస్టెంట్ సుధాకర్, అశోక్‌తోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.