Dharmaram | ధర్మారం, జనవరి 14: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ పద్మజ-జితేందర్ రావు ఆధ్వర్యంలో గోదారంగనాథుడి కళ్యాణాన్ని బుధవారం నిర్వహించారు. నెల రోజులపాటు ఆలయంలో భక్తులు ప్రతీరోజు ఉదయం విష్ణు పారాయణం చదివారు. చివరి రోజు ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
గోదా రంగనాథుడి కళ్యాణోత్సవం, ధనుర్మాసం విశిష్టత గురించి ఆలయ కమిటీ చైర్మన్ భక్తులకు వివరించారు. అనంతరం గోదా రంగనాధుడికి సాంప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు కళ్యాణతంతు పూర్తి చేశారు. ఈ ఉత్సవంలో ఆలయ ధర్మకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.