చలికాలం.. జీవాలు పదిలం
చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. దీంతో జీవాల్లో పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నది. పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు.
- మేకలు, గొర్రెలకు వ్యాధులు సోకే అవకాశం
- అప్రమత్తంగా ఉండాలంటున్న పశువైద్యులు
హుజూరాబాద్ టౌన్, డిసెంబర్16: చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. దీంతో జీవాల్లో పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నది. పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. వాతావరణంలో అకస్మా త్తుగా వచ్చే మార్పులతో జీవాలకు తుమ్ములు, కండ్లు, ముకు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కని పిస్తుంటాయి. క్రిములతో సోకే అంటువ్యాధులతో పాటు ఆరు బయట తినడంతో శ్వాస కోశంలోకి వచ్చే కణాలతో వ్యాధులు వస్తాయి.
పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
వ్యాధుల నివారణకు గానూ జీవాలకు గాలి, వెలుతురు సరిగ్గా వచ్చే విధంగా చూడాలి. వాతా వరణం అనుకూలంగా లేనప్పుడు జీవాలను బయటకు వదలకూడదు. పాకలను శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధులు సోకినప్పుడు పశువైద్యాధికారులను సంప్రదించాలి. చలికాలంలో పీపీఆర్ వ్యాధి సోకిన జీవాలు పారిన పెండ, ముకు, కండ్ల నుంచి వచ్చే ద్రవాలతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. జీవాలకు ముకు నుంచి నీళ్లు కారడం ప్రారంభమై, ఒకటి, రెండు రోజుల్లో చీమిడి రూపంలోకి మారుతుంది. కండ్లు ఎర్రబడి నీరు కారుతుంది. నోటి లోపలి పొర దెబ్బతిని, చిగుళ్లు పొర సెక్రోసిస్ చెందవచ్చు. ఊపిరితిత్తులకు వ్యాధి సోకడం వల్ల దగ్గు వస్తుంది. దీంతో జీవాలు నీళ్ల పారడంతో మూడు నాలుగు రోజుల్లోనే చనిపోయే అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
జీవాలపై శ్రద్ధ వహించాలి
జీవాలు చలి బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జీవాల విషయంలో పెంపకందారులు ఎకవగా శ్రద్ధ వహించాలి. పీపీఆర్(పుర్రు) వైరస్ జీవాలకు సోకే అవకాశం ఉంటుంది. దీని నివారణకు నిర్ధిష్టమైన చికిత్స లేదు. రోగాలు రాకుండా దీర్ఘకాలంపాటు పనిచేసే అక్రిటెట్రాసైక్లిన్ వాడొచ్చు. నీరసించిన జీవాలకు గ్లూకోజ్ ఎకించొచ్చు. పెంపకందారులు జీవాల పాకలను శుభ్రంగా ఉంచుకోవాలి. గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
– రవీందర్రెడ్డి, మండల పశువైద్యాధికారి
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

