MP Vamsi Krishna | గోదావరిఖని : సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ ఒకటి పరిధిలోని జీడికే-11 గనిలో సోమవారం పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ దిగి పని స్థలాలను పరిశీలించారు. ముందుగా గనిపై దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి అనంతరం కార్మికుల డ్రెస్ కోడ్ తో ఎంపీ గనిలోకి దిగారు. ఈ సందర్భంగా గనిలో పని స్థలాలను పరిశీలించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సొంతింటి కల మారుపేర్ల సమస్య ఇతర సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రిటైర్డ్ కార్మికుల పెన్షన్ ను కనీసం రూ.10వేలకు పెంచాలని పార్లమెంట్లో ప్రస్తావించానని, అలాగే ఇతర సమస్యలపై పార్లమెంటులో గళం వినిపించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కార్మికులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తాను తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు ఎంపీ వెంట కాంగ్రెస్ నాయకులు పీ మల్లికార్జున్, రాచకొండ కోటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.