Singareni | గోదావరిఖని : గోదావరిఖని పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆర్.జి 1 ఏరియా జిఎం లలిత్ కుమార్ శుక్రవారం అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో మందుల స్టోరేజ్ యొక్క స్థితి పేషెంట్ లకు అందుతున్న మందుల వివరాలను సంబందిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి కార్మిక కుటుంబాలకు ఎక్కడ కుడా మందుల కొరత రాకుండా తగు చర్యలను తీసుకోవాలని సూచించారు.
అవసరమైతే మందులను లోకల్ గా కొనుగోలు చేసి అందించేలా చూడాలని పేర్కొన్నారు. ప్రతీ ఒక్క ఉద్యోగికి తప్పని సరిగా మందులు అందేలా చూడాలన్నారు. మెడికల్ స్టోర్ కి వెళ్లి మెడికల్ కెపాసిటీ తెలుసుకున్నారు. పేషెంట్ లకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఏరియా హాస్పిటల్ లోని క్యాజువాలిటీ వార్డ్ ను సందర్శించి అక్కడ పేషెంట్ లకు అందుతున్న వైధ్య సేవల గురించి వైధ్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీఎం తో పాటు డీవైసీఏంఓ డాక్టర్ అంబిక, సెక్యూరిటీ ఆఫీసర్ వీరా రెడ్డి, ఏరియా హాస్పటల్ సిబ్బంది ఉన్నారు.