బోయినపల్లి, ఫిబ్రవరి 19: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని, అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరవుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఆదివారం బోయినపల్లి మండలం రత్నంపేట, బోయినపల్లి శివాలయంతో పాటు, విలాసాగర్ శ్రీ త్రిలింగ సంగమేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజలు, భక్తుల మనోభావాలు ప్రతిబింబించేలా ఆలయాలను తీర్చిదిద్దుతున్నదని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలోని ఆలయాలన్నీ సకల సౌకర్యాలతో విరజిల్లుతున్నాయని వివరించారు. ఇక్కడ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, సర్పంచులు రంగి రేణుక, గుంటి లతశ్రీ, జూలపల్లి స్వప్నాంజలి, చిందం రమేశ్, కన్నం మధు, ఎంపీటీసీలు ఈడ్గు రాజేశ్వరి, సంబ బుచ్చమ్మ, బీఆర్ఎస్ నాయకులు జూలపల్లి అంజన్రావు, ఈడ్గు స్వామి, సంబ లక్ష్మీరాజం, గుంటి శంకర్, ఐరెడ్డి మల్లారెడ్డి, రంగి తిరుపతి ఉన్నారు.