Vemulawada | వేములవాడ, జూలై 20 : వేములవాడ ఆర్డివో కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి దరఖాస్తు చేసుకొని వృద్ధ దంపతులు న్యాయం చేయాలని ఆర్డివో కేఎస్ బీ కుమారిని కోరారు. వేములవాడ మండలంలోని మారుపాక గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు రాఘవులు లక్ష్మి తమ కుమారుడు వ్యవసాయ భూమిలో పంట వేయకుండా కౌలు దారుడని అడ్డుకొని తమకు డబ్బులు రాకుండా చూస్తూ వేధింపుల గురి చేస్తున్నాడని వారు అధికారితో వాపోయారు.
దీంతో స్పందించిన ఆర్డీవో సంబంధిత రెవెన్యూ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశానని వచ్చి సమస్య పరిష్కరిస్తారని వృద్ధ దంపతులకు హామీ ఇచ్చింది. వచ్చిన మరో మూడు దరఖాస్తులను కూడా సంబంధిత అధికారులకు పంపి తక్షణమే సమస్యలు పరిష్కరించేలా చూడాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు.