PEDDAPALLY | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 09: పెద్దపల్లి మండలం లోని ముత్తారం గ్రామానికి చెందిన బాలసాని జంపయ్య గౌడ్ ( 46) గీత కార్మికుడు బుధవారం ప్రమాద వశాత్తు తాటి చెట్టు పై నుండి జారి పడి తలకు కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాడు. తీవ్ర గాయాల పాలై అస్వస్థకు గురైన బాలసాని జంపయ్యను ముత్తారం కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు తీగల శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు సహకారంతో సహచర గీతకార్మికులు హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ దవఖానకు తరలించి చికిత్స జరిపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు