National Award | సుల్తానాబాద్ రూరల్, జూన్ 18 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామానికి చెందిన, కడ్డీ తంత్రి వాయిధ్య కళాకారుడు దురిచేటి రామయ్య కు కేంద్ర ప్రభుత్వ పురస్కార్ అవార్డు దక్కింది. ఆయన ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు గురువారం హర్షం వ్యక్తం చేశారు.
గ్రామస్తులు పులి వెంకటేశంతో పాటు పలువురు రామయ్య ఇంటికి వెళ్లి అవార్డుకు ఎంపిక కావడం పట్ల శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. నిరుపేద కుటుంబానికి చెందిన రామయ్య కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.