ఈ ప్రపంచంతో ఓ ఆటాడుకోండి..
నిజానికి ఈ ప్రపంచమే మీ చేతుల్లో ఉంది. విజయం.. మీ ఇంటి గుమ్మం ముందే కాచుకొని కూర్చుంది. అయితే, మీరు అలా ఆలోచించి మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే.. ఈ గెలుపు మీ సొంతమవుతుంది. ఎందుకంటే, కలలను నిరంతరం శ్వాసించేవారినే విజయలక్ష్మి వరిస్తుంది.
నిజానికి ఈ ప్రపంచమే మీ చేతుల్లో ఉంది. విజయం.. మీ ఇంటి గుమ్మం ముందే కాచుకొని కూర్చుంది. అయితే, మీరు అలా ఆలోచించి మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే.. ఈ గెలుపు మీ సొంతమవుతుంది. ఎందుకంటే, కలలను నిరంతరం శ్వాసించేవారినే విజయలక్ష్మి వరిస్తుంది. అలా కాకుండా, మనసంతా అపనమ్మకంతో నిండి ఉంటే.. అపజయమే ఎదురవుతుంది. మరి.. మీరూ అలాంటి విజయాలను అందుకోవాలంటే, మీలోనూ సానుకూల దృక్పథం పెరగాలి. అందుకోసం.. కొన్ని చిన్న చిన్న ఆటలు ఆడాలి.

ఏదైనా కొత్త పని మొదలుపెట్టేటప్పుడు ఎక్కువగా ప్రతికూల ఆలోచనలే వస్తుంటాయి. ‘ఒకవేళ నష్టపోతే!?’.. ‘ఒకవేళ నేను ఓడిపోతే?’ లాంటి ఆలోచనలు మీలో ఆందోళనను, ఆత్మవిశ్వాస లోటూను పెంచుతాయి. అందుకు భిన్నంగా.. ‘ఒకవేళ’ను
సానుకూలంగా మార్చుకోండి. ఒకవేళ భారీ లాభాలు సాధిస్తే!?.. ఒకవేళ నేను విజయం సాధిస్తే!? లాంటి ప్రశ్నలు.. మీలో పాజిటివ్‌నెస్‌ను పెంచుతాయి.

అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవు. అలాంటప్పుడే నిరాశలో కూరుకుపోతాం. కానీ, ఒక చిన్న ఆట.. మీ భావాలను, మీ ఆలోచనా దృక్పథాన్నే పూర్తిగా మార్చేస్తుంది. మీకు ఎక్కువ ఆనందాన్నిచ్చే ఒక చిన్న ఆలోచనతో ఈ ఆట మొదలుపెట్టండి. ఆ అనుభూతిని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. ఆ తర్వాత దానికంటే మెరుగైన మరో సానుకూల ఆలోచనను మనస్సులో ఊహించుకోండి. ఇలా.. 3 నుంచి 10 నిమిషాల పాటు చేయండి. రోజూ తాగే కాఫీ మొదలుకొని.. ఉద్యోగం, బంధాలు, ఆరోగ్యం లాంటి విషయాల వైపు మీ ఆలోచనల్ని సాగనివ్వండి. ఇది.. జీవితంలో సానుకూల ఉత్సాహాన్ని నింపుతుంది.

అన్ని విషయాల్లోనూ సానుకూలంగా ఆలోచించండి. మీ దగ్గర ఏదీ లేదనే బాధ నుంచి.. అన్నీ మీతోనే ఉన్నాయనే భావన వైపు మీ ఆలోచనలను మళ్లించండి. ‘అది నాకు కావాలి..’ అనుకునే బదులుగా.. ‘ఒకవేళ అది నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో కదా..?’ అని ప్రశ్నించుకోండి. ఇలాంటి ప్రశ్నలు.. మీ కల నిజమైతే మీరు ఏం చేస్తారో ఊహించుకునేలా మీ మనస్సును ప్రేరేపిస్తాయి. మీ సంకల్పానికి చోదకశక్తిలా పనిచేస్తాయి.

మీరు నిరాశలో కూరుకు పోయినప్పుడు, మీ మూడ్‌ను మార్చుకోవడానికి.. మరో ఆసక్తికరమైన ఆట ఒకటి ఉంది. మీ జీవితంలో మీరు ఊహించకుండానే జరిగిన ఏవైనా మంచి విషయాలను ఊహించుకోండి. ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకోవడం, ఉచితంగా కాఫీ దొరకడం, ట్రాఫిక్‌లో వరుసగా గ్రీన్ సిగ్నల్స్ పడటం.. ఇలాంటి చిన్నచిన్న విషయాలను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. ఇవన్నీ మీలోకి సానుకూల శక్తిని ఆహ్వానించేవే!

దేనికైనా ‘ప్లాన్-బి’ లేదని గట్టిగా ఫిక్స్ అవ్వండి. ప్రతి అవకాశాన్నీ అదే చివరిదని భావించండి. మీరు ఏం సాధించాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే ఊహించుకోండి. ముఖ్యంగా, ‘అది జరగకపోతే!?’ అనే ప్రతికూల పరిస్థితిని అస్సలు ఆలోచించకండి. అదే నిజం కాబోతున్నదని నమ్ముతూ.. మీ మనసులో ఆ సానుకూల ఊహలతోనే ఉండండి. ఆపై జరిగే మ్యాజిక్‌ను చూడండి.

Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Business
- Health
- life style
- Success
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

