Appointed | ధర్మారం,అక్టోబర్23: ధర్మారం మండలం పీఆర్టీయూ (టీఎస్) మండల అధ్యక్షుడిగా కటికనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గంకిడి వెంకట రమణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం ధర్మారం మండల కేంద్రంలో ఎంఆర్సీ కార్యాలయం వద్ద పీఆర్టీయూ (టీఎస్) సర్వసభ్య సమావేశం ఆ సంఘం మండల అసోసియేట్ శ్రీనివాస చక్రవర్తి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం మండలాధ్యక్షుడు పదవి కోసం ఎన్నిక చేపట్టారు. దీంతో హాజరైన ఉపాధ్యాయుల ఏకాభిప్రాయం మేరకు సంఘం మండల శాఖ అధ్యక్షుడిగా వెంకటరమణ రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు ఎన్నికల పరిశీలకులుగా ముద్దసాని సతీష్, సురేంద్ర నాయక్, రమేష్ నాయక్ వ్యవహరించారు.
ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు దేవి రమేష్, మండల ప్రధాన కార్యదర్శులు తాళ్లపెల్లి శ్రీనివాస్, చిల్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ నూతన మండలాధ్యక్షుడిగా ఎన్నికైన వెంకటరమణారెడ్డిని ఈ సందర్భంగా సన్మానించి అభినందించారు.