శాంతిభద్రతల పరిరక్షణే నా లక్ష్యం. ఎక్కడా వెనక్కి తగ్గేదిలేదు. కమిషనరేట్ పరిధిలో గంజాయి వినియోగం, అక్రమ రవాణా చేసేవారితో పాటు భూ మాఫియా భరతం పడుతం. మంచివారికి మాత్రమే ఫెండ్రీ పోలీస్. నేరస్తులు, గూండాగిరీకీ ఇక్కడ స్థానం లేదు.
శాంతిభద్రతల పరిరక్షణలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. నాకు అన్నిరంగాల్లో పనిచేసిన అనుభవం ఉన్నది. అయేషా మీరా కేసులో నిందితుల అరెస్ట్తోపాటు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హెలిక్యాప్టర్లో దుర్మరణం ఘటనపై కేసు విచారణ నా జీవితంలో మరిచిపోలేనిది. ర్యాగింగ్ అనేది సీనియర్లు జూనియర్లకు మార్గదర్శనంగా ఉండాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు.
– రామగుండం పోలీస్ కమిషనర్గా బ్యాధతల స్వీకరించిన సందర్భంగా శ్రీనివాసులు