కరీంనగర్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : తాను పదిహేనేండ్లుగా ఎమ్మెల్యేగా రాజకీయాల్లో ఉన్నానని, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కరీంనగర్ ను ఎంతో అభివృద్ధి చేశానని కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశా రు. మీ బిడ్డగా మీతోనే ఉన్నానని, మరోసారి మంచి మెజార్టీతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, కేటీఆర్ మన వెంట ఉన్నారని, రాబోయే రోజుల్లో కరీంనగర్ హైదరాబాద్ తర్వాత ఒక గొ ప్ప నగరంగా కరీంనగర్‌ను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇప్పటికే నగరంలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించామని, ఇంకా అనేక పనులు కొ నసాగుతున్నాయని, ఈ పనులు పూర్తి చేయాలంటే మరోకరితో సాధ్యం కాదని అన్నారు. కాంగ్రెస్, బీ జేపీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తప్పా మళ్లీ మీ మధ్యన ఎప్పుడు కనిపించారని ప్రశ్నించారు. జనం మధ్యకు ఎవరు వస్తున్నారు? ఏం చేస్తున్నారు? అని గమనించాలని సూచించారు.
బుధవారం కరీంనగర్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం రాకముందు కూడా ప్రభుత్వాలు ఉన్నాయని, కరీంనగర్ అభివృద్ధి సమైక్య పాలకులు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని మంత్రి గంగుల ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇప్పటి వరకు మచ్చ లేకుండా బతికానని చెప్పారు. ఈ పదిహేనేండ్లలో నగరాన్ని శాంతియుత వాతావరణంలో ఉంచామని అన్నారు. ఎక్కడైతే హిందువులు, ముస్లింలు కలిసి నడుస్తారో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని భావించి ముందుకెళ్లామన్నారు. అందుకే కరీంనగర్ హైదరాబాద్ తర్వాత ఒక గొప్ప నగరంగా మారిందని స్పష్టం చేశారు. ఈ నగరం, ఈ జిల్లా అభివృద్ధి కొనసాగాలని ఈ విషయాలు చెబుతున్నానని అన్నారు. ఇంకా ఆయన మాటల్లోనే..
జీవన ప్రమాణాలు పెంచుకున్నం
నేను మొదటి సారి ఎమ్మెల్యేగా ఉన్నపుడు సమైక్య పాలనలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వద్దకు వెళ్లి కరీంనగర్‌కు ఒక్క కోటి రూపాయలు ఇవ్వాలని ప్రాధేయపడిన. అయినా ఒక్క రూపాయి ఇవ్వ లేదు. అదే తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి.. కరీంనగర్ అంటే మీకు ఎంతో ఇష్టమని, నగరాభివృద్ధికి నిధులు కావాలని అడిగితే వెంటనే 300 కోట్లు ఇచ్చిన ఘనత ఆయనదే. ఇప్పుడు కరీంనగర్లో ఎటు చూసినా అద్భుతమైన రోడ్లు కనిపిస్తున్నయి. కరీంనగర్‌కో షాన్ బడాదియా. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచుకున్నం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అద్భుతమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకున్నం. ఒక వైపు మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జ్ మరోవైపు వెంకటేశ్వర ఆలయం, ఈద్గా, కృష్ణుడి ఆలయం, మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం.
తప్పు చేయద్దు.. గోస పడద్దు
రాష్ర్టాన్ని ఢిల్లీ పాలకుల చేతిలో పెడితే నలబైయాభై ఏండ్ల దరిద్రాన్ని చూశాం. ఇప్పుడు ఇతర పార్టీల చేతిలో తెలంగాణను పెడితే మళ్లీ అదే గతి పడుతుంది. మన బిడ్డల భవిష్యత్తు అందకారం అవుతుంది. తెలంగాణ ఏర్పడితే గుడ్డి దీపం అవుతుందని ఆనాడు చెప్పిన మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, ఇప్పుడు బీజేపీ ముసుగులో వచ్చి హైదరాబాద్‌లో అడ్డా వేసిండు. అపుడు కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణను పచ్చిగా వ్యతిరేకించిన వైఎస్ షర్మిల ఇపుడు తెలంగాణ గడ్డ మీద నిలబడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే. ఈ పార్టీలు ఢిల్లీలో కలుసుకుంటాయి. తెలంగాణను వ్యతిరేకించిన ఢిల్లీ పెద్దలంతా ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కూర్చున్నారు. ఎలాగైనా కేసీఆర్‌ను ఓడించి తెలంగాణను ఆంధ్రాలో కలపాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. 1956లో మన తాత ముత్తాలు చేసిన తప్పుకు నలభై యాభై ఏండ్ల దరిద్రాన్ని చూశాం. ఇపుడు మనం ఆ తప్పు చేయద్దు. మన పిల్లల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ను అధికారంలోకి తేవాలి.
ఢిల్లీ చేతులో పెడుదామా..? కేసీఆర్ చేతిలో పెడుదామా..?
మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణను ఢిల్లీ చేతి లో పెడదామా? హైదారాబాద్‌లో ఉన్న షేర్ కేసీఆర్ చేతిలో పెడదామా? అనేది ఒక్కసారి ఆలోచించాలి. నలభై యాభై ఏండ్లు ఢిల్లీ చేతిలో ఉన్న తె లంగాణను చూశాం. పదేండ్లు కేసీఆర్ చేతిలో ఉన్న తెలంగాణను చూస్తున్నాం. ఎవరిపాలన ఎట్లున్నదో తేల్చుకొని, సరైన నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. నీళ్లు వచ్చినయి. కరెంట్ వచ్చింది. హైదరాబాద్ సహా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతున్నది. ప్ర పంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తు న్న తరుణం లో అధికారాన్ని ఢిల్లీ పెద్దల చేతిలో పెడితే తిరిగి గదే గుడ్డి దీపం, అస్తవ్యస్థమైన పరిపాలన తప్పదు.