Ganesh | చిగురుమామిడి, ఆగస్టు 28: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో రెండో రోజు గణేష్ పూజలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు డప్పుచప్పులతో మొదటి రోజు మండపాల వద్దకు గణేశుడిని తరలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం పూజలు నిర్వహించారు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వినాయకుడి మండపాల వద్ద భక్తులకు కొంత ఇబ్బంది ఏర్పడింది. భక్తి భావంతోనే మండపాల వద్ద యువత ఉండాలని, మద్యం తాగి రావద్దని ఎస్సై సాయికృష్ణ మండల ప్రజలకు సూచించారు. ఇతరులకు ఇబ్బందులు తలెత్తకుండా మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు ఎస్సై తెలిపారు. ప్రతిరోజు మండలంలో వినాయకుని మండపాల వద్దకు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.