Jeevan Reddy | చేపనారు కొనుగోలుకు నిధులివ్వాలి.. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి
మత్స్యకార సొసైటీలకు ప్రభుత్వం నేరుగా చేపనారు కొనుగోలు చేసుకునేందుకు నిధులందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
- మత్స్యకారులకు నేరుగా చేపనారు నిధులు ఇవ్వాలి
Jeevan Reddy | జగిత్యాల, నవంబర్ 9 : మత్స్యకార సొసైటీలకు ప్రభుత్వం నేరుగా చేపనారు కొనుగోలు చేసుకునేందుకు నిధులందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మత్స్యకార సోదరులు జీవన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులు, రైతాంగానికి చెరువులు, కుంటలు, సాగునీటి వనరులతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండితే భూగర్భ జలమట్టం పెరిగి రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు మత్స్యకారులకు చేపల పెంపకానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం చెరువులు, కుంటలు నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఎస్ఆర్ఎస్పీలో ఉన్న నీటిని డిసెంబర్లో విడుదల చేస్తే పెద్ద సంఖ్యలో చెరువులు నింపే అవకాశం ఉంటుందన్నారు. దీనివల్ల రైతులకు భూగర్భ జలాలు పెరగడంతో పాటు మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కోణంలో కాకుండా రైతులు, మత్స్యకారులు, ప్రజల ప్రయోజనాల కోసం వినియోగంలోకి తీసుకురావాలని జీవన్‌రెడ్డి కోరారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద తాత్కాలిక చర్యలతో నీటిని నిల్వ చేసి కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా ఎగువకు ఎత్తిపోయే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ దిగువన కాఫర్ డ్యామ్ నిర్మించి నీటి మట్టాన్ని పెంచితే ఎత్తిపోతల ద్వారా నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు వినియోగానికి అనుకూలంగా ఉన్నాయని సంబంధిత సాంకేతిక సంస్థల పరీక్షల్లో వెల్లడైందని పేర్కొన్నారు. ఒకవైపు నీటిని వినియోగంలోకి తీసుకువస్తూనే మరోవైపు మేడిగడ్డకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని అన్నారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని, రైతాంగానికి సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేపనారు జూన్, జూలైలో చెరువుల్లో వదిలితే చేపల పెంపకానికి అనుకూలంగా ఉంటుందని, అయితే నవంబర్ వచ్చినా ప్రభుత్వం చేపనారు పంపిణీ చేయలేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. మత్స్య సహకార సంఘాలే సొంతంగా చేపనారు కొనుగోలు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం చేపనారు బదులు ఆ నిధులను సొసైటీలకు నేరుగా అందిస్తే, వారు చెరువు విస్తీర్ణానికి అనుగుణంగా చేపనారు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని సూచించారు. రైతులు మొక్కజొన్న, ఆముదం, సోయాబీన్ తదితర ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని జీవన్‌రెడ్డి అన్నారు.
ఆరుతడి పంటలకు డ్రిప్ సౌకర్యం కల్పించాలని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే రైతులకు డ్రిప్ పరికరాలు అందించే విధానం తీసుకురావాలని కోరారు. చెరువుల పరిరక్షణకు గతంలో చేపట్టిన మిషన్ కాకతీయ తరహాలో చెరువులు, కుంటల మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. జగిత్యాల పట్టణ తాగునీటి సమస్యపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, రజనీకాంత్, రాధాకిషన్, ధర రమేశ్, పల్లికొండ రాజు, రాజేశ్, మైపాల్ తదితర మత్స్యకార సంఘ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

