Sarangapur | సారంగాపూర్, ఫిబ్రవరి 2 : క్రీడలతో విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందుతుందని, క్రీడలు ఆడడం వల్ల శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తహసల్దార్ వహిదొద్దీన్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం మండల స్థాయి సీఎం కఫ్ క్రీడల సెలక్షన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ ఆటలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేశారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వహిదొద్దిన్, ఎంపీడీవో ఎండీ సలీం, ఎస్ఐ గీత, మండల విద్యాధికారి కిశోర్, స్థానిక సర్పంచ్ చేకూట అరుణ శేఖర్, పీడీలు రవీందర్, వేణు, ఉపాద్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.