Friendship Day | ఓదెల, ఆగస్టు 3 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం యువకులు ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్నేహానికి ఉన్న గొప్పతనాన్ని పేర్కొన్నారు. స్నేహం విలువైనది, వెల కట్టలేనిది, స్నేహానికి మించిన అదృష్టం మరోటి లేదన్నారు.
నిస్వార్ధంగా సహాయం అందించే వారే నిజమైన స్నేహితులని తెలిపారు. స్నేహానికన్నా లోకాన లేదు మిన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ రాష్ట్ర నాయకుడు మాటూరి రత్నం ఆధ్వర్యంలో జరగగా, నాయకులు బైరి రవి గౌడ్, దొడ్డే శంకర్, సాతూరి అనిల్, జీదుల పాపయ్య, మద్దెల శ్రీనివాస్, మాటూరి నర్సయ్య, కొల్లూరి రాజేశం, యువకులు తదితరులు పాల్గొన్నారు.