Wageshwari | తిమ్మాపూర్, జూన్ 11 : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాళేశ్వరీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు, ఎంసీఏ విభాగం ఆధ్వర్యంలో వీడ్కోలు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాసంస్థల జనరల్ సెక్రెటరీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈఈఈ విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యుత్ శాఖలో ఉద్యోగాల కోసం టార్గెట్గా పెట్టుకొని ముందడుగు వేయాలని సూచించారు.
ఎంసీఏ విద్యార్థులు ప్రాంగణ నియమకాల్లో ఉద్యోగాలు తెచ్చుకోవాలని, చిన్నస్థాయిగా ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో కళాశాల జాయింట్ సెక్రెటరీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు వినోద్, ప్రకాష్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, హెచ్ఓడీలు చంద్రమౌళి, బాపూజీ, తదితరులు పాల్గొన్నారు.