Free online coaching | చిగురుమామిడి, ఏప్రిల్ 7: చిగురుమామిడి మండలం ముల్కనూరు లోని మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్, నీట్ (EAPCET & NEET) లో జటాధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ జెట్ వారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ హర్జిత్ కౌర్ తెలిపారు.
మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులలో అడ్మిషన్ పొందేందుకుగాను (EAPCET & NEET) ప్రవేశ పరీక్షలలో అత్యున్నత ర్యాంకులు సాధించేందుకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ హర్జిత్ కౌర్ తెలిపారు. ఇందులో చిన్న ముల్కనూర్ మోడల్ స్కూల్ కు చెందిన ఐదుగురు విద్యార్థులకు జటాదర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ జెట్ వారి సౌజన్యంతో ఆన్లైన్ కోచింగ్ క్లాసులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ అవకాశాన్ని మోడల్ స్కూల్ విద్యార్థులు సక్రమంగా వినియోగించుకుని మంచి ఫలితాలు సాధించాలని ప్రిన్సిపాల్ విద్యార్థులను కోరారు. పేద విద్యార్థులకు కాంపిటేటీవ్ పరీక్షలలో అత్యున్నతమైన కోచింగ్ అందిస్తున్నందుకు జటాధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ జెట్ వారికి ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు.