Chigurumamidi | చిగురుమామిడి, జనవరి 20 : చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 80 మందికి పైగా గ్రామస్తులు రక్త, మూత్ర పరీక్షలతో పాటు టీబీ పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.
ప్రతీ నెల ప్రభుత్వ ఆరోగ్యఉప కేంద్రంలో అవసరం ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందజేసే వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారిని ప్రసన్న గ్రామస్తులను కోరారు. ఈ వైద్య శిబిరంలో స్టాఫ్ నర్స్ సుజాత, ఏఎన్ఎం ధనలక్ష్మి, పద్మ, ఆశ కార్యకర్తలు సుజాత, సంధ్య, సుగుణ పంచాయతీ కార్యదర్శి జ్యోతి, వార్డు సభ్యులు మధు, రజనీకాంత్, రజిత పాల్గొన్నారు.