Chigurumamidi | చిగురుమామిడి, మార్చి 14 : చిగురుమామిడి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వికాస తరంగణి, చల్మెడ ఆనందరావు ఆసుపత్రి సౌజన్యంతో మహిళలకు శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. క్యాన్సర్ నివాణకు ముందస్తు జాగ్రత్తలను వైద్యులు వివరించారు. 78 మంది మహిళలకు సర్వేకల్ బ్రెస్ట్ పరీక్షలు నిర్వహించగా, 150 మందికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.
వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్య శిబిరంలో వికాస తరంగిణి అధ్యక్షుడు గౌతమ్ రావు, వైద్యులతో పాటు సర్పంచ్ ఆకవరం భవాని, ఉప సర్పంచ్ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి కాల్వ రమేష్, కారోబార్ గొల్లపల్లి సత్యనారాయణ, వార్డు సభ్యులు శ్రీనివాస్, సమ్మయ్య, లావణ్య, అంజయ్య, శివాంజనేయులు మహిళలు పాల్గొన్నారు.