Free medical camp | పెగడపల్లి : పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జగిత్యాలకు చెందిన శ్రీ పావని వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బండారి మణెమ్మ-శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా దవాఖాన వైద్యుడు శ్రీకాంత్ రెడ్డి గ్రామానికి చెందిన 160 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు బండారి శ్రీనివాస్, ప్రశాంత్, మహేష్ పాల్గొన్నారు.