Medical camp | కోల్ సిటీ, సెప్టెంబర్ 1: గోదావరిఖని జీవిత బీమా కార్యాలయంలో సోమవారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లోకేష్ హాజరై సుమారు 200 మంది ఎస్ఐసీ ఉద్యోగులు, సిబ్బంది, కస్టమర్లకు ఉచితంగా బీపీ, ఈసీజ్. 2డీ ఏకో పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేశారు.
ఎల్ఐసీ ఉద్యోగులు, కస్టమర్లకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. మెడికవర్ ఆస్పత్రిలో పండుగలు, సెలవులతో సంబంధం లేకుండా 24 గంటలు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటు ఉంటాయని తెలిపారు.
బీమాతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమనీ, ప్రస్తుత కాలుష్యం వల్ల చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారనీ, గుండె వ్యాధులు దరి చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎల్ ఐ సి మేనేజర్ మల్లేష్, ఉద్యోగులు, సిబ్బంది మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, యూనస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.